ఏడాదికి ఒక్కసారే రీఛార్జ్.. Jio, ఎయిర్‌టెల్, BSNL, వీఐ ప్లాన్స్ ఇవే.. ఎందులో తక్కువంటే?
Wed Jun 11, 2025 16:38 Business
మొబైల్ నెట్‌వర్క్ రెండు రకాలు ఉంటుంది. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్. పోస్ట్ పెయిడ్ ప్లాన్ అయితే రీఛార్జ్ చేయాల్సిన గోల ఉండదు. నెల నెలా బిల్ చెల్లిస్తే సరిపోతుంది. అయితే, ప్రీపెయిడ్ సిమ్ కార్డ్ అయితే, ముందుగానే నిర్దేశిత ప్లాన్‌తో రీఛార్జ్ చేయాలి. నెల, మూడు నెలలు, ఆరు నెలల వ్యాలిడిటీ ప్లాన్స్ ఎక్కువగా రీఛార్జ్ చేస్తుంటారు. అయితే, ఇలా నెల నెలా రీఛార్జీలు చేయడం కికాకుగా అనిపిస్తుంది. అలా భావించే వారందరికీ ఏడాది ప్లాన్స్ బెటర్ అని చెప్పవచ్చు. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే చాలు ఏడాది వరకు ఎలాంటి భయం ఉండదు. ఈ క్రమంలో ప్రముఖ టెలికాం కంపెనీలు అందిస్తున్న ఏడాది ప్లాన్స్, 300 రోజులకు పైబడిన వ్యాలిడిటీ కలిగి రీఛార్జ్ ప్లాన్ల గురించి తెలుసుకుందాం.
ఎయిర్‌టెల్ ఏడాది ప్లాన్..
భారతీ ఎయిర్ టెల్ రూ.3599కి 365 రోజుల వ్యాలిడిటీ ప్యాక్ అందిస్తోంది. ఇందులో రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, స్పామ్ ఫైటింగ్ నెట్ వర్క్, ఎక్స్ ట్రీమ్ ప్లే ఉచిత కంటెంట్ వంటి బెనిఫిట్స్ కల్పిస్తోంది. ఎయిర్‌టెల్ రూ.3999 ప్లాన్ ద్వారా 365 రోజుల వ్యాలిడిటీ అందిస్తోంది. ఇందులో రోజుకు 2.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, జియో హాట్ స్టార్, స్పామ్ ఫైటింగ్ నెట్ వర్క్, ఎక్స్ ట్రీమ్ ప్లే ఫ్రీ కంటెంట్ ఇస్తోంది. అలాగే రూ.2249 ద్వారానూ 365 రోజుల వ్యాలిడిటీ ఇస్తోంది. ఇందులో 30 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తాయి. రూ.1849 ప్యాక్ ద్వారానూ 365 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అయితే ఇందులో డేటా ఉండదు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉంటాయి.
ఇది కూడా చదవండి: ట్రైన్స్‌లో టాయిలెట్స్ ఎందుకు పెట్టారో తెలుసా? ఈ విషయం తెలియకుండా వాటిని వాడకండి!
జియోలో ఏడాది ప్యాక్..
రిలయన్స్ జియో టెలికాం సంస్థ 365 రోజుల వ్యాలిడిటీతో ఏడాది రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్ ధర రూ.3999గా నిర్ణయించింది. ఇందులో ఏడాది పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2.5 జీబీ డేటా, 90 రోజుల పాటు జియో హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్, 50 జీబీ జియో ఏఐ క్లౌడ్ స్టోరోజ్, జియో టీవీ వంటి బెనిఫిట్స్ కల్పిస్తోంది. అలాగే, జియో రూ.3599 ప్లాన్ సైతం అందిస్తోంది. దీని వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంటుంది. రోజుకు 2.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 90రోజులు జియో హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్, 50 జీబీ జియో ఏఐ క్లౌడ్ స్టోరేజీ వంటివి ఉన్నాయి. జియో రూ.1748 ప్యాక్ ద్వారా 336 రోజుల వ్యాలిడిటీ అందిస్తోంది. దీని ద్వారా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది. జియో రూ.1234 ప్లాన్ (జియో భారత్ ఫోన్) ద్వారా 336 రోజుల వ్యాలిడిటీ ఇస్తోంది. ఇందులో రోజుకు 0.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, జియో సావన్, జియో టీవీ ఇస్తోంది.
ఇది కూడా చదవండి: కపుల్స్‌కి పండగే.. కీలక నిర్ణయం తీసుకున్న ఓయో! 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి...
బీఎస్ఎన్ఎల్ ఏడాది ప్లాన్స్..
రూ.2399 ద్వారానే 395 రోజుల వ్యాలిడిటీ కల్పిస్తోంది. ఇందులో రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ వస్తాయి. రూ.1999 ప్యాక్ ద్వారా 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. 600 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ వస్తాయి. రూ.1499 ప్లాన్ ద్వారా 336 రోజుల వ్యాలిడిటీ 24 జీబీ డేటా, వాయిస్ కాల్స్ ఉంటాయి. రూ.1515ప్లాన్ ద్వారా 365 రోజుల వ్యాలిడిటీ రోజుకు 2 జీబీ డేటా మాత్రమే వస్తుంది. రూ.1198 ప్లాన్ ద్వారా 365 రోజుల వ్యాలిడిటీ 3 జీబీ డేటా, 300 నిమిషాల కాల్స్ వస్తాయి.
వొడాఫోన్ ఐడియా ఏడాది ప్లాన్స్..
రూ.3699 ప్లాన్ ద్వారా 365 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందిస్తోంది. అర్ధరాత్రి 12 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉచిత డేటా సౌకర్యం కల్పిస్తోంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు మిగిలిపోయిన డేటాను శని, ఆదివారాల్లో వాడుకోవచ్చు. జియో హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్, ప్రతి నెలా 2 జీబీ వరకు బ్యాకప్ డేటా వస్తుంది. అలాగే రూ.3599 ప్యాక్ ద్వారా 365 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ వస్తాయి. అలాగే ఇతర బెనిఫిట్స్ ఉంటాయి. రూ.3799 ప్యాక్ ద్వారానూ 365 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్స్, అర్ధరాత్రి 12 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉచిత డేటా, మిగిలిన డేటాను శని, ఆదివారాల్లో వాడుకోవచ్చు. రూ.3499 ప్లాన్ ద్వారా ఏడాది వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులో రోజుకు 1.5 జీబీ డేటా సహా పైన ప్లాన్ బెనిఫిట్సీ అన్నీ ఉంటాయి. రూ.1999 ప్లాన్ ద్వారా ఏడాది వ్యాలిడిటీ, 24 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తాయి.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..
పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులు, నటీనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం
12న కూటమి భారీ బహిరంగ సభ.. వచ్చే నాలుగేళ్ల పాలనకు..
ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.7 వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!
రైతులకు ప్రభుత్వం ఉచితంగా రూ.70 వేలు.. ఎలా పొందాలి? ఎవరికి వస్తాయి?, అర్హతలు ఇవే!
పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు!
సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!
బాలయ్యకు చంద్రబాబు బర్త్‌డే విషెస్! సోషల్ మీడియా వేదికగా..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Recharge #Jio #Airtel #VI #BSNL #PrepaidMobileNetworks #OneYearVadidity #Business
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.